9, జులై 2018, సోమవారం

ఉత్తరకాండము - 111వ సర్గ


ఉత్తరకాండము - 110వ సర్గ


ఉత్తరకాండము - 109వ సర్గ


ఉత్తరకాండము - 107వ సర్గ


ఉత్తరకాండము - 106వ సర్గ


ఉత్తరకాండము - 105వ సర్గ


ఉత్తరకాండము - 104వ సర్గ


ఉత్తరకాండము - 103వ సర్గ


ఉత్తరకాండము - 102వ సర్గ


ఉత్తరకాండము - 101వ సర్గ


ఉత్తరకాండము - 100వ సర్గ


ఉత్తరకాండము - 99వ సర్గ


ఉత్తరకాండము - 98వ సర్గ


ఉత్తరకాండము - 97వ సర్గ


ఉత్తరకాండము - 96వ సర్గ


ఉత్తరకాండము - 95వ సర్గ


ఉత్తరకాండము - 94వ సర్గ


ఉత్తరకాండము - 93వ సర్గ


ఉత్తరకాండము - 92వ సర్గ


ఉత్తరకాండము - 91వ సర్గ


ఉత్తరకాండము - 90వ సర్గ


ఉత్తరకాండము - 89వ సర్గ


ఉత్తరకాండము - 88వ సర్గ


ఉత్తరకాండము - 87వ సర్గ


ఉత్తరకాండము - 87వ సర్గ


ఉత్తరకాండము - 86వ సర్గ


ఉత్తరకాండము - 85వ సర్గ


ఉత్తరకాండము - 84వ సర్గ


ఉత్తరకాండము - 83వ సర్గ


ఉత్తరకాండము - 82వ సర్గ


ఉత్తరకాండము - 81వ సర్గ


ఉత్తరకాండము - 80వ సర్గ


ఉత్తరకాండము - 79వ సర్గ


ఉత్తరకాండము - 78వ సర్గ


ఉత్తరకాండము - 77వ సర్గ


ఉత్తరకాండము - 76వ సర్గ


ఉత్తరకాండము - 75వ సర్గ


ఉత్తరకాండము - 74వ సర్గ


ఉత్తరకాండము - 73వ సర్గ


ఉత్తరకాండము - 72వ సర్గ


ఉత్తరకాండము - 71వ సర్గ


ఉత్తరకాండము - 70వ సర్గ


ఉత్తరకాండము - 69వ సర్గ


ఉత్తరకాండము - 68వ సర్గ


ఉత్తరకాండము - 67వ సర్గ


ఉత్తరకాండము - 66వ సర్గ


ఉత్తరకాండము - 65వ సర్గ


ఉత్తరకాండము - 64వ సర్గ


ఉత్తరకాండము - 63వ సర్గ


ఉత్తరకాండము - 62వ సర్గ

 
ఓం ..శ్రీ గణపతయే నమః ..శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః .../\
శ్రీమద్రామాయణము ...ఉత్తర కాండము ...62 ..సర్గ ..1--21 శ్లోకములు ..

తేటగీతులు ...

రాముడు ఋషుల మ్రొక్కుచు రమ్యరీతి
వారి మాటలు వినుచును పృచ్చ నడిగె
నిట్లు , లవణాసురుమిగుల నెట్టి భుక్తి
తినును ?ఎవ్విధ నడవడి ? తెలుపు సుమ్మి ! (1)

రామునిదెమాట వినినట్టి మునులు దెల్పె
లవణుడెటులవృద్దొందగ రక్తి గట్టె ?
మధువననివాసి ,మునులదే మాంస మెంతొ
మత్త యౌప్రాణు లన్నియు మెక్కు చుండ !(2) (3)

కొన్ని వేలసింహపులేళ్ళ ,గోరి నరుల
పగలు జంపుచు నిత్యమె బట్టి దినును
ప్రళయ కాలము నందున బలము యున్న
మృత్యు దేవతాననదెర్చి మృగము దిన్న! (4) (5)

రాముడువినగ మునులతో ప్రతిగ బల్కె
ఆతని దునుమాడగ జేదుఁనత్యవసర
ముగను,భయమును విడువుడు ముందు మీరు
వినిన మునులంత ముదముగ వినతి జేసె !(6)

రాముడు గ్రతేజులె మునులకునుఁజేసె
యాన ,చటనున్న సోదరు నంత జూసి
ఇట్లడిగెరామ ,లవణుని నెవ్వ ? ధీర
జంప గలడునో బహుబల శాలి భరతు? ! (7) (8)

వానినికడదేర్చ బహు ,బహు బుధుడంత
శత్రు ఘ్నువశ మగునీయ సాధ్య మగునె
అన్న వచనము వినినంత భరతు ప్రతిగ
బల్కె ,దునుమాడెదనేను బట్టి భాగ
మీయ నాకును వచియించె మీదు ప్రేమ ! (9)

పసిడి యాసన మందుండి పలుక గాను
మ్రొక్కుచునురాజు నుత్తముడులె
భరతుడునుగొప్ప కార్యము బట్టి యుండె
ఇంతకు మునుపే ,యొప్పుచునెంత మేలు ! (10)

తొలుత నార్యుల రాకకై దుఃఖ మొందె
అయోధ్య నందు సంతాప మందుండె
మనము పరితపించ గనెంతొ మదన పడగ
రక్ష ణీయగ దేశము లాటుఁనఱయ !(11)

రాజ!కఠినమౌ దుఃఖముల లాటు బడసె
గొప్ప యశమున్న ప్పటికి గోరి ఫలము
నంది గ్రామముఁ దినుచును కంద మూల
ములనె భుక్తిగా ,జటనొంది చనుచు గడిపె !(12)

నార బట్టలె ధరియించె నంది నందు
కటిక నేలపై శయనించె గరిమఁదండ్రి
బాధ నెంతయొ దిగమ్రింగి ప్రజల మేలుఁ
గోరి పరిపాలనొనర్చెఁగునుకు ద్రప్పి ! (13)

ఇట్టి క్లేశములబడసె నితడు నోర్మి
నేను జనుటకు సిద్ధమే ఋషుల జెంత
భరతు నిమరిక్లే శములను బడయ నీయ
పంప దగిననే నుండగా బాడి గాదు ! (14 )

తమ్ము నివెమాట లువినగ తనర రామ
నట్లె ,యగుగాక నదిశాస నముగ నాదు
మంగళ కరమైనగరము మధువు నందు
రాజు గనునిన్ను జేయుదు లక్షణముగ !(15) (16)


భరతునికిశ్రమ నీయక భార మవక
దలచె శూరుడు వీవును ధర్మములను
విద్య నెఱింగి రాజ్యము వివృత జేయ
నేర్పరివినీవు దేశము నేలు కొనుము !(17)

యమున తీర మందున గట్టు నందమైన
నగర మొకటియు భద్రమై నట్టిదేను
జనపదమునింపు ,వంశము సమసి బోవ
నిమ్న రాజ్యముఁ మరొకరి నియమితి లేక! (18)

రాజ్యమునివేశనమునందు రాజు నుంచ
యున్నచొనట్టె వరైనను యమపురి కియె
ఏగునన్నది సత్యముఁనెంత జూడ
అనుచు నానతి నీయగ ఆర్ద్ర తగను ! (19)

శూర !నామాట వలదన్న యుక్తమేన ?
అన్న ననుజ్ఞ పాటింపు చిన్న వారు
ఇందు నమరేమి సంశయ మేమి లేదు
అనగ రాముడు ,తమ్ముడు నట్లె యనెను ! (20)

నేను కడగట్టి నభిషేకఁనిక్కచ్చిగ
అమలు జేయగ వశిష్టు , లందరున్ను
యథా శాస్త్ర్రము సలుపగ యంత జూసె
స్వీకరించుము ద్విజుల స్వస్తి గరిమ !

బాల నందిని అను ఉత్తర కాండము లో 62. సర్గ సమాప్తము .
1..నుండి 21 శ్లోకములు .../\ 

ఉత్తరకాండము - 61వ సర్గ


ఉత్తరకాండము - 60వ సర్గ


ఉత్తరకాండము - 59వ సర్గ


ఉత్తరకాండము - 58వ సర్గ


ఉత్తరకాండము - 57వ సర్గ

శ్రీమద్రామాయణము ..ఉత్తర కాండము ....57 సర్గ ..1-21 శ్లోకములు ...
తేటగీతులు...

దివ్య కథవిన్న సౌమిత్రి భవ్యముగను 
సంతసంబునగ్రజునితో సమయమందు 
అగ్రజ సురలుపూజించు నక్షయముగ 
నిమి వశిష్టు లె మేనెట్లు నిజము బడసె ? (1)(2)
లక్ష్మణునిమాట వినగను లక్షణముగ 
నున్న శ్రీరామ చంద్రుడు నూతనముగ 
గరిమ గలనట్టి వశిష్టు గాధ జెప్పె 
శౌరి రమ్యమై మెఱయుచు శౌర్య మందు ! (3)
సోద ర,ఘనము వరుణుని శుక్లముంచ 
కుంభమందును ,నిరువురు కొమరులుగను
ద్విజులుగ తేజమఱయగ తీరు బుట్టె
ఋషుల శ్రేష్టలె వారివురున్ను తనరు !(4)

మున్ను భగవంతడగస్త్యుని మోము గనగ 
నీకొ మరుడకాననుచునూ నేగె నంత 
కుంభ మందువరుణతేజ కుదురు నుండ 
వారలు నొఖరే దండ్రిగ బడయలేదు !(5)

ఊర్వశినిమిత్త స్ఖలిత యుక్తవేడి 
మిత్రునిదెకుంభమందుంచె ,పిదప వరుణ
తేజ ముంచిన నచటనే దివ్యముగను 
భువిని గలిగెనగస్త్యుండు బుధుడగుచును !(6)

పిమ్మట యెగొంత సమయాన పేర్మినఱయ 
ఇక్ష్వాకు లదీపు డెవసిష్టు డుద్భవించె 
మిత్రవరుణుల వలననే మీదునొప్పె 
దివ్య శుభముల నొనగూర్ప దీప్తిమంతఁ(7)

సౌమ్యు ।దోషరహితుడైన సాధుమూర్తి 
నట్టి ,యావసిష్టుడుయె పుట్టినంత 
గొప్ప తేజము నిక్ష్వాకు గోరి జేసె 
నేరుగాపురోహితునిగా నేర్మి బెరుగ!(8)

సౌమిత్రి!తేజుడెవసిష్టు సరియు కాయ
మెటుల,కల్గెనొ నుడివితి ,నెటుల నిమియు
నన్న విషయమెరింగింతు , ననగ రామ
వినుము , సెవవీయ సోదరు వినదొడంగె !(9)

దేవ తాస్వరూపులనున్న దివ్యమైన 
ఋషులు కాయము కొఱవైన రూప లేమి
రాజుకునుయోగ దీక్షీయ రమ్యమౌచు 
ఘనత కాదిదె ద్విజుల కరుణ దృక్కు !(10)

అట్టి ద్విజుశ్రే ష్టులంత యచ్చటున్న 
పౌరులనుభృత్యు లనుగూడి కాయమున్ను 
గాచె సుగంధ ద్రవ్యమున్ ఘనపు విరుల 
ఉడుపు లందును త్రాణగ యురవుఁదాచె ! (11)(12)

నంత సురలందరు నడిగె నచట నిమిని
ఇష్టి బొందగ ,నీ చిత్తం, నెచట నుంచ 
వలెనొ జెప్పుమనియెనట వానిగనుచు 
నిమియు నిట్లనె నుత్తర మీయగాను !(13)

దేవతలమాట విన్నట్టి దివ్య నిమియు 
చిత్తమును దెల్పె ,సకలమౌ చిత్తు గనుల 
పైన నివసముండ గయాక ప్రభువు , నిమ్ము 
అడిగినదెమీఱ సురలుచెప్పగ సాగె!(14)

నంతట విబుధులును పల్కె నట్లె ననగ 
వాయు రూపమందుంటును బ్రాణులకును 
నేత్రములపైన నిలకడ నివస ముండు
అనుచు విజ్ఞులు నిమితోడ నాదమందు ! (15)

వాయు రూపముఁదిరుగగఁబగలు రేయి 
ప్రాణి కోటియున్ విశ్రాంతి బడయ నెంచి 
మాటి మాటికిన్ గండ్లను మధ్య లోన 
రాజ!మూయుచున్నుండరె రమ్య గతిన !(16)

ఇట్లు పలికిన సురలంత నట్లె చనెను
వచ్చి నట్టిదెసమహాత్మ వారు ఋషులు 
నిమిని దేహము తీసుకునిచనె నిమ్న 
ప్రదేశమునకు నందరున్ పదిలముగను !(17)

గరిమలగను ఋషులునట , గలుగగోరి 
నిమికి ,పుత్రుండు ,పుట్టించ నెంచి ఆర 
ణినితొ మంత్రప ఠనొనర్చె నిండు హోమ 
ములను జేయుచున్ మధించే ముఖ్యు లంత!(18)

ఆరణినిమధించగ గొప్ప వారుఁదపసి 
పురుషు డావిర్భవించెను పుట్టు కయును 
మధించుటచేత కల్గగన్ మహిమ మిదియు 
జనకు డనియును ప్రసిద్ధి జగము నందు !(19)

నంత నశరీరు నందుట్టె ననగ ప్రభువు 
జనకు విదేహు బేరొచ్చె జగజగాల 
కడ్మి నఱయగ విఖ్యాతి కలుగ మిథిల
పేరు బడసెన్నొప్పుచు పెదవులందు !(20)

సౌమిత్రి !వసిష్టునకుశాపమీయ 
నిమియును,వసిష్టు శపింప నిమిని 
ఇరువు రికిగల్గె జన్మలు నిట్టులుండ 
ఒక్క పరిగను విభ్రాంతి నుడివితినిదె ! (21) 

ఉత్తర కాండము ..57. వ సర్గ 1--21 శ్లోకములు /\ 

ఉత్తరకాండము - 56వ సర్గ


ఉత్తరకాండము - 55వ సర్గ


ఉత్తరకాండము - 54వ సర్గ


ఉత్తరకాండము - 53వ సర్గ


ఉత్తరకాండము - 52వ సర్గ


ఉత్తరకాండము - 51వ సర్గ


ఉత్తరకాండము - 50వ సర్గ


ఉత్తరకాండము - 49వ సర్గ


ఉత్తరకాండము - 48వ సర్గ


ఉత్తరకాండము - 47వ సర్గ


ఉత్తరకాండము - 46వ సర్గ


ఉత్తరకాండము - 45వ సర్గ


ఉత్తరకాండము - 44వ సర్గ


ఉత్తరకాండము - 43వ సర్గ


ఉత్తరకాండము - 42వ సర్గ


ఉత్తరకాండము - 41వ సర్గ


ఉత్తరకాండము - 40వ సర్గ


ఉత్తరకాండము - 39వ సర్గ


ఉత్తరకాండము - 38వ సర్గ


ఉత్తరకాండము - 37వ సర్గ


ఉత్తరకాండము - 36వ సర్గ


ఉత్తరకాండము - 35వ సర్గ


ఉత్తరకాండము - 34వ సర్గ


ఉత్తరకాండము - 33వ సర్గ


ఉత్తరకాండము - 32వ సర్గ


ఉత్తరకాండము - 31వ సర్గ


ఉత్తరకాండము - 30వ సర్గ


ఉత్తరకాండము - 29వ సర్గ


ఉత్తరకాండము - 28వ సర్గ


ఉత్తరకాండము - 27వ సర్గ


ఉత్తరకాండము - 25వ సర్గ


ఉత్తరకాండము - 26వ సర్గ


ఉత్తరకాండము - 24వ సర్గ


ఉత్తరకాండము - 23వ సర్గ


ఉత్తరకాండము - 22వ సర్గ


ఉత్తరకాండము - 21వ సర్గ


ఉత్తరకాండము - 20వ సర్గ


ఉత్తరకాండము - 19వ సర్గ


ఉత్తరకాండము - 17వ సర్గ


ఉత్తరకాండము - 16వ సర్గ


ఉత్తరకాండము - 15వ సర్గ


ఉత్తరకాండము - 14వ సర్గ


ఉత్తరకాండము - 13వ సర్గ


ఉత్తరకాండము - 4వ సర్గ


ఉత్తరకాండము - 5వ సర్గ


ఉత్తరకాండము - 6వ సర్గ


ఉత్తరకాండము - 7వ సర్గ


ఉత్తరకాండము - 8వ సర్గ


ఉత్తరకాండము - 10వ సర్గ


ఉత్తరకాండము - 12వ సర్గ


ఉత్తరకాండము - 11వ సర్గ


ఉత్తరకాండము - 18వ సర్గ


ఉత్తరకాండము - 108వ సర్గ


ఉత్తరకాండము - 9వ సర్గ


4, జులై 2018, బుధవారం

ఉత్తరకాండము - 3వ సర్గ

ఉత్తరకాండము - 3వ సర్గ

ఉత్తరకాండము - 2వ సర్గ

ఉత్తరకాండము - 2వ సర్గ

ఉత్తరకాండము - 1వ సర్గ

ఉత్తరకాండము - 1వ సర్గ

ఉత్తరకాండము - అనువాదం - సూచనలు.

ఉత్తరకాండము - అనువాదకులకూ పరిష్కర్తలకూ సూచనలు.

దయచేసి కవిమిత్రులు అందరూ ఈ కాండలోని ఏ సర్గకు సంబంధించిన శ్లోకాలను తెనిగించి ఆ సర్గ తాలూకు టపా క్రిందనే వ్యాఖ్యల రూపంలో ఉంచండి. ఎక్కడపడితే అక్కడ పద్యాలను ఇస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది సేకర్తలకు.


మీమీ తెలుగు పద్యాలకు మూలాన్ని తప్పని సరిగా సూచించండి.

ఉదాహరణకు

(ఉత్తరకాండము - 1వ సర్గ 10వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు)

పద్యం
పద్యం
...
పద్యం.

మొత్తం 16 పద్యాలు

ఈ విధంగా సూచించటం వలన పరిష్కర్తలకు ఒకే సర్గలో

వివిధ శ్లోకాలకు వేరు వేరు కవుల పద్యాలను ఒక క్రమంలో ఉంచటానికి వీలవుతుంది.
అలాగే మొత్తం సర్గ అంతా ఒకే కవి వ్రాసినా భాగాలు భాగాలుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యల రూపంలో పద్యాలను ఇచ్చినా అన్నింటినీ ఒకక్రమంలో ఉంచటానికి వీలవుతుంది.

పద్యాలన్నీ వాల్మీకాన్ని తప్పనిసరిగా అనుసరించాలన్న నియమం ఉందని ప్రసాద్ గారి వలన విన్నాను. వీలయినంతవరకు

వాల్మీకి ఇచ్చిన పదాలను వాడండి,

భావంలో స్వతంత్ర కల్పనల కన్నా వాల్మీకిని అనుసరించటానికే పెద్ద పీట వేయండి.

ఆన్నీ తేటగీతికలే.

ఐతే ఇల్లాంటి తెలుగుపద్యాలకు పాదాంత విరామం వీలైనంతగా ఇవ్వటం శోభిస్తుంది.

సర్గలను పంచటమూ లేదా పెద్దసర్గలో భాగాలను పంచటమూ తోపెల్లవారి బాధ్యత అనుకుంటాను.

తోపెల్ల వారికి విజ్ఞప్తి ఏమిటంటే మూలాన్ని దిగుమతి చేసుకుందుకు ఈ భాగులోనే లింకులు ఇవ్వండి.  మొబైలో watsapp వంటివాటి ద్వారా  ఇస్తే నాబోటి వారికి ఇబ్బంది. నాకు మొబైల్ నిరంతరాయంగా వాడటం సాధ్యపడదు.

పరిష్కర్తలకు సూచన.  పద్యరచయిత వ్యాఖ్య క్రిందనే తమ పరిష్కరణలు సూచించటం మంచిది. మరలా మొత్తం పద్యాలన్నింటినీ ఉటంకించవద్దు.  పద్యారంభాన్ని సూచించి దానిలో మార్పులు సూచిస్తే చాలును. దయచేసి పద్యరచయితలు ఒక్క విషయం గమనించాలి - పరిష్కర్తలు సవరించిన పిదప వారితో వాదాలకు దిగకండి. వారి నిర్ణయం ఖరారుగా తీసుకోవలసినదే. చర్చలు అనుమతించబడవు - వాటితో గడబిడ వలన టపాలు కూర్చటం పెద్ద శ్రమ అవుతుందని గమనించగలరు.


అన్ని సర్గలకూ వేరు వేరు టపాలు ఏర్పాటు చేస్తున్నాను. ఆయా సర్గలక్రిందనే తమ అనువాదాలు, పరిష్కరణలూ అన్నీను.


అందరూ సహకరించవలసిందిగా ప్రార్థన.



1, జులై 2018, ఆదివారం

స్వాగతం


శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః


అనంత ఛందము వారి రామాయణ రచన బ్లాగుకు స్వాగతం.

ఇది ఒక ప్రైవేట్ బ్లాగు.

సభ్యులకు మాత్రమే ప్రవేశం.

నిర్వాహకులు మాత్రమే టపాలు ప్రచురించగలరు.

నిర్వాహకులతో పాటు సభ్యులు మాత్రమే బ్లాగును తెరచి చదువగలరు, వ్యాఖ్యలు చేయగలరు.

నిర్వాహకులు సూచించిన సర్గభాగాలకు సభ్యులు తమతమ పద్యాలను ఇక్కడ వ్యాఖ్యల రూపంలో ఉంచవలసి ఉంటుంది. ఆ వ్యాఖ్యలను నిర్వాహకులు తమ ఇ-మెయిలు లోనూ బ్లాగులోనూ కూడా చూడగలరు.

ఆ వ్యాఖ్యలను గుదిగ్రుచ్చుకొని సర్గలను తెలుగుపద్యాలలో ప్రకటించటం నిర్వాహకుల పని.

వ్యాఖ్యలు బ్లాగులోనుండి ప్రకటన అనంతరం తొలగించ బడతాయి.


సభ్యులు తమ తమ పద్యాలను ముమ్మారు సరిచూచుకొని మరీ ఇచ్చిన పక్షంలో నిర్వాహకుల పని తేలిక అవుతుంది.

శుభం భూయాత్.