శ్రీమద్రామాయణము ..ఉత్తర కాండము ....57 సర్గ ..1-21 శ్లోకములు ...
తేటగీతులు...
దివ్య కథవిన్న సౌమిత్రి భవ్యముగను
సంతసంబునగ్రజునితో సమయమందు
అగ్రజ సురలుపూజించు నక్షయముగ
నిమి వశిష్టు లె మేనెట్లు నిజము బడసె ? (1)(2)
లక్ష్మణునిమాట వినగను లక్షణముగ
నున్న శ్రీరామ చంద్రుడు నూతనముగ
గరిమ గలనట్టి వశిష్టు గాధ జెప్పె
శౌరి రమ్యమై మెఱయుచు శౌర్య మందు ! (3)
సోద ర,ఘనము వరుణుని శుక్లముంచ
కుంభమందును ,నిరువురు కొమరులుగను
ద్విజులుగ తేజమఱయగ తీరు బుట్టె
ఋషుల శ్రేష్టలె వారివురున్ను తనరు !(4)
మున్ను భగవంతడగస్త్యుని మోము గనగ
నీకొ మరుడకాననుచునూ నేగె నంత
కుంభ మందువరుణతేజ కుదురు నుండ
వారలు నొఖరే దండ్రిగ బడయలేదు !(5)
ఊర్వశినిమిత్త స్ఖలిత యుక్తవేడి
మిత్రునిదెకుంభమందుంచె ,పిదప వరుణ
తేజ ముంచిన నచటనే దివ్యముగను
భువిని గలిగెనగస్త్యుండు బుధుడగుచును !(6)
పిమ్మట యెగొంత సమయాన పేర్మినఱయ
ఇక్ష్వాకు లదీపు డెవసిష్టు డుద్భవించె
మిత్రవరుణుల వలననే మీదునొప్పె
దివ్య శుభముల నొనగూర్ప దీప్తిమంతఁ(7)
సౌమ్యు ।దోషరహితుడైన సాధుమూర్తి
నట్టి ,యావసిష్టుడుయె పుట్టినంత
గొప్ప తేజము నిక్ష్వాకు గోరి జేసె
నేరుగాపురోహితునిగా నేర్మి బెరుగ!(8)
సౌమిత్రి!తేజుడెవసిష్టు సరియు కాయ
మెటుల,కల్గెనొ నుడివితి ,నెటుల నిమియు
నన్న విషయమెరింగింతు , ననగ రామ
వినుము , సెవవీయ సోదరు వినదొడంగె !(9)
దేవ తాస్వరూపులనున్న దివ్యమైన
ఋషులు కాయము కొఱవైన రూప లేమి
రాజుకునుయోగ దీక్షీయ రమ్యమౌచు
ఘనత కాదిదె ద్విజుల కరుణ దృక్కు !(10)
అట్టి ద్విజుశ్రే ష్టులంత యచ్చటున్న
పౌరులనుభృత్యు లనుగూడి కాయమున్ను
గాచె సుగంధ ద్రవ్యమున్ ఘనపు విరుల
ఉడుపు లందును త్రాణగ యురవుఁదాచె ! (11)(12)
నంత సురలందరు నడిగె నచట నిమిని
ఇష్టి బొందగ ,నీ చిత్తం, నెచట నుంచ
వలెనొ జెప్పుమనియెనట వానిగనుచు
నిమియు నిట్లనె నుత్తర మీయగాను !(13)
దేవతలమాట విన్నట్టి దివ్య నిమియు
చిత్తమును దెల్పె ,సకలమౌ చిత్తు గనుల
పైన నివసముండ గయాక ప్రభువు , నిమ్ము
అడిగినదెమీఱ సురలుచెప్పగ సాగె!(14)
నంతట విబుధులును పల్కె నట్లె ననగ
వాయు రూపమందుంటును బ్రాణులకును
నేత్రములపైన నిలకడ నివస ముండు
అనుచు విజ్ఞులు నిమితోడ నాదమందు ! (15)
వాయు రూపముఁదిరుగగఁబగలు రేయి
ప్రాణి కోటియున్ విశ్రాంతి బడయ నెంచి
మాటి మాటికిన్ గండ్లను మధ్య లోన
రాజ!మూయుచున్నుండరె రమ్య గతిన !(16)
ఇట్లు పలికిన సురలంత నట్లె చనెను
వచ్చి నట్టిదెసమహాత్మ వారు ఋషులు
నిమిని దేహము తీసుకునిచనె నిమ్న
ప్రదేశమునకు నందరున్ పదిలముగను !(17)
గరిమలగను ఋషులునట , గలుగగోరి
నిమికి ,పుత్రుండు ,పుట్టించ నెంచి ఆర
ణినితొ మంత్రప ఠనొనర్చె నిండు హోమ
ములను జేయుచున్ మధించే ముఖ్యు లంత!(18)
ఆరణినిమధించగ గొప్ప వారుఁదపసి
పురుషు డావిర్భవించెను పుట్టు కయును
మధించుటచేత కల్గగన్ మహిమ మిదియు
జనకు డనియును ప్రసిద్ధి జగము నందు !(19)
నంత నశరీరు నందుట్టె ననగ ప్రభువు
జనకు విదేహు బేరొచ్చె జగజగాల
కడ్మి నఱయగ విఖ్యాతి కలుగ మిథిల
పేరు బడసెన్నొప్పుచు పెదవులందు !(20)
సౌమిత్రి !వసిష్టునకుశాపమీయ
నిమియును,వసిష్టు శపింప నిమిని
ఇరువు రికిగల్గె జన్మలు నిట్టులుండ
ఒక్క పరిగను విభ్రాంతి నుడివితినిదె ! (21)
ఉత్తర కాండము ..57. వ సర్గ 1--21 శ్లోకములు /\
తేటగీతులు...
దివ్య కథవిన్న సౌమిత్రి భవ్యముగను
సంతసంబునగ్రజునితో సమయమందు
అగ్రజ సురలుపూజించు నక్షయముగ
నిమి వశిష్టు లె మేనెట్లు నిజము బడసె ? (1)(2)
లక్ష్మణునిమాట వినగను లక్షణముగ
నున్న శ్రీరామ చంద్రుడు నూతనముగ
గరిమ గలనట్టి వశిష్టు గాధ జెప్పె
శౌరి రమ్యమై మెఱయుచు శౌర్య మందు ! (3)
సోద ర,ఘనము వరుణుని శుక్లముంచ
కుంభమందును ,నిరువురు కొమరులుగను
ద్విజులుగ తేజమఱయగ తీరు బుట్టె
ఋషుల శ్రేష్టలె వారివురున్ను తనరు !(4)
మున్ను భగవంతడగస్త్యుని మోము గనగ
నీకొ మరుడకాననుచునూ నేగె నంత
కుంభ మందువరుణతేజ కుదురు నుండ
వారలు నొఖరే దండ్రిగ బడయలేదు !(5)
ఊర్వశినిమిత్త స్ఖలిత యుక్తవేడి
మిత్రునిదెకుంభమందుంచె ,పిదప వరుణ
తేజ ముంచిన నచటనే దివ్యముగను
భువిని గలిగెనగస్త్యుండు బుధుడగుచును !(6)
పిమ్మట యెగొంత సమయాన పేర్మినఱయ
ఇక్ష్వాకు లదీపు డెవసిష్టు డుద్భవించె
మిత్రవరుణుల వలననే మీదునొప్పె
దివ్య శుభముల నొనగూర్ప దీప్తిమంతఁ(7)
సౌమ్యు ।దోషరహితుడైన సాధుమూర్తి
నట్టి ,యావసిష్టుడుయె పుట్టినంత
గొప్ప తేజము నిక్ష్వాకు గోరి జేసె
నేరుగాపురోహితునిగా నేర్మి బెరుగ!(8)
సౌమిత్రి!తేజుడెవసిష్టు సరియు కాయ
మెటుల,కల్గెనొ నుడివితి ,నెటుల నిమియు
నన్న విషయమెరింగింతు , ననగ రామ
వినుము , సెవవీయ సోదరు వినదొడంగె !(9)
దేవ తాస్వరూపులనున్న దివ్యమైన
ఋషులు కాయము కొఱవైన రూప లేమి
రాజుకునుయోగ దీక్షీయ రమ్యమౌచు
ఘనత కాదిదె ద్విజుల కరుణ దృక్కు !(10)
అట్టి ద్విజుశ్రే ష్టులంత యచ్చటున్న
పౌరులనుభృత్యు లనుగూడి కాయమున్ను
గాచె సుగంధ ద్రవ్యమున్ ఘనపు విరుల
ఉడుపు లందును త్రాణగ యురవుఁదాచె ! (11)(12)
నంత సురలందరు నడిగె నచట నిమిని
ఇష్టి బొందగ ,నీ చిత్తం, నెచట నుంచ
వలెనొ జెప్పుమనియెనట వానిగనుచు
నిమియు నిట్లనె నుత్తర మీయగాను !(13)
దేవతలమాట విన్నట్టి దివ్య నిమియు
చిత్తమును దెల్పె ,సకలమౌ చిత్తు గనుల
పైన నివసముండ గయాక ప్రభువు , నిమ్ము
అడిగినదెమీఱ సురలుచెప్పగ సాగె!(14)
నంతట విబుధులును పల్కె నట్లె ననగ
వాయు రూపమందుంటును బ్రాణులకును
నేత్రములపైన నిలకడ నివస ముండు
అనుచు విజ్ఞులు నిమితోడ నాదమందు ! (15)
వాయు రూపముఁదిరుగగఁబగలు రేయి
ప్రాణి కోటియున్ విశ్రాంతి బడయ నెంచి
మాటి మాటికిన్ గండ్లను మధ్య లోన
రాజ!మూయుచున్నుండరె రమ్య గతిన !(16)
ఇట్లు పలికిన సురలంత నట్లె చనెను
వచ్చి నట్టిదెసమహాత్మ వారు ఋషులు
నిమిని దేహము తీసుకునిచనె నిమ్న
ప్రదేశమునకు నందరున్ పదిలముగను !(17)
గరిమలగను ఋషులునట , గలుగగోరి
నిమికి ,పుత్రుండు ,పుట్టించ నెంచి ఆర
ణినితొ మంత్రప ఠనొనర్చె నిండు హోమ
ములను జేయుచున్ మధించే ముఖ్యు లంత!(18)
ఆరణినిమధించగ గొప్ప వారుఁదపసి
పురుషు డావిర్భవించెను పుట్టు కయును
మధించుటచేత కల్గగన్ మహిమ మిదియు
జనకు డనియును ప్రసిద్ధి జగము నందు !(19)
నంత నశరీరు నందుట్టె ననగ ప్రభువు
జనకు విదేహు బేరొచ్చె జగజగాల
కడ్మి నఱయగ విఖ్యాతి కలుగ మిథిల
పేరు బడసెన్నొప్పుచు పెదవులందు !(20)
సౌమిత్రి !వసిష్టునకుశాపమీయ
నిమియును,వసిష్టు శపింప నిమిని
ఇరువు రికిగల్గె జన్మలు నిట్టులుండ
ఒక్క పరిగను విభ్రాంతి నుడివితినిదె ! (21)
ఉత్తర కాండము ..57. వ సర్గ 1--21 శ్లోకములు /\
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.