శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
అనంత ఛందము వారి రామాయణ రచన బ్లాగుకు స్వాగతం.
ఇది ఒక ప్రైవేట్ బ్లాగు.
సభ్యులకు మాత్రమే ప్రవేశం.
నిర్వాహకులు మాత్రమే టపాలు ప్రచురించగలరు.
నిర్వాహకులతో పాటు సభ్యులు మాత్రమే బ్లాగును తెరచి చదువగలరు, వ్యాఖ్యలు చేయగలరు.
నిర్వాహకులు సూచించిన సర్గభాగాలకు సభ్యులు తమతమ పద్యాలను ఇక్కడ వ్యాఖ్యల రూపంలో ఉంచవలసి ఉంటుంది. ఆ వ్యాఖ్యలను నిర్వాహకులు తమ ఇ-మెయిలు లోనూ బ్లాగులోనూ కూడా చూడగలరు.
ఆ వ్యాఖ్యలను గుదిగ్రుచ్చుకొని సర్గలను తెలుగుపద్యాలలో ప్రకటించటం నిర్వాహకుల పని.
వ్యాఖ్యలు బ్లాగులోనుండి ప్రకటన అనంతరం తొలగించ బడతాయి.
సభ్యులు తమ తమ పద్యాలను ముమ్మారు సరిచూచుకొని మరీ ఇచ్చిన పక్షంలో నిర్వాహకుల పని తేలిక అవుతుంది.
శుభం భూయాత్.
అనంత ఛందము వారి రామాయణ రచన బ్లాగుకు స్వాగతం.
నిర్వాహకులు సూచించిన సర్గభాగాలకు సభ్యులు తమతమ పద్యాలను ఇక్కడ వ్యాఖ్యల రూపంలో ఉంచవలసి ఉంటుంది. ఆ వ్యాఖ్యలను నిర్వాహకులు తమ ఇ-మెయిలు లోనూ బ్లాగులోనూ కూడా చూడగలరు.
ఆ వ్యాఖ్యలను గుదిగ్రుచ్చుకొని సర్గలను తెలుగుపద్యాలలో ప్రకటించటం నిర్వాహకుల పని.
వ్యాఖ్యలు బ్లాగులోనుండి ప్రకటన అనంతరం తొలగించ బడతాయి.
సభ్యులు తమ తమ పద్యాలను ముమ్మారు సరిచూచుకొని మరీ ఇచ్చిన పక్షంలో నిర్వాహకుల పని తేలిక అవుతుంది.
శుభం భూయాత్.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః శ్రీ సరస్వత్యైనమః శ్రీరాఘవేంద్రాయనమః మిత్రులందరకూ సాదర స్వాగతం. ఇక్కడ ఏరకమైన శుభోదయ శుభరాత్రి సందేశములు మరి యే ఇతర సందేశములు పెట్టవలదు. కేవలము మీకు ఇవ్వబడిన సర్గల అనువాద పద్యములను మాత్రమే ప్రచురించండి.
రిప్లయితొలగించండిప్రాగుద్బూత దివాకరోపమసమార్హ్య జ్ఞానరాగచ్ఛటా
తొలగించండిభోగాంచ ద్ద్యుత సప్తకాండయుత సంపూర్ణేతిహాసంబుగా
శ్రీగోవిందకథాసుధాభరితమౌ శ్రీరామచారిత్రమున్
వాగీశాంశ వచించి నట్టి సుకవిన్ వాల్మీకి నర్చించెదన్.
వీరిని add చేయగలరు
రిప్లయితొలగించండి1. ahamsri@gmail.com
2. Padmajamantralanrpm@gmail.com
3. drrkmn@rediffmail.com
4. mn.sriharesh@rediffmail.com
5. ramakrishnavaranasi55@gmail.com
6. shankarkandi@gmail.com
7. shankarkandi@gmail.com
8. wbhavani@gmail.com
9. aprvprasad@gmail.com
10. vvsmantravadi9@gmail.com
11. 1) kavisreesattibabu@gmail.com
12. vijayalakshmi.tummalapalli@gmail.com
13. prabhakarp14@gmail.com
14. Vgkgorthi@gmail.com
15. gspgsp2017@gmail.com
16. Chavali.domestic@gmail.com
17. seetaramanath@gmail.com
18. bhamidipatikalidas45@gmail.com
19. lsrksastry@gmail.com
20. jayadwanipaper@gmail.com
21. apaji.peri@gmail.com
22. sailumadhavp@gmail.com
23. siva. nvsp@gmail. Com
24. padmajaraju.c@gmail.com
25. rameshperi1978@gmail.com
26. ksikhakolli@gmail.com
27. venkataramakrishna.gali@gmail.com
28. suseelakdevi@gmail.com
29. gundumadhusudhan555@gmail.com
30. vanivenkat96@gmail.com
31. Kinnipunni@gmail.com
32. Apparaos05@gmail.com
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజయోస్తు
తొలగించండిదిగ్విజయోఽస్తు!
రిప్లయితొలగించండిశుభమస్తు
రిప్లయితొలగించండిశ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
రిప్లయితొలగించండిశ్రీరామచంద్రసహాయసిద్ధిరస్తు..
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ మహాసరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః
శుభమస్తు.... దిగ్విజయోస్తు.....
రిప్లయితొలగించండిThis is kavisreesattibabu
తొలగించండి1. రామునానతి ద్వారియు రయము వెడలె
రిప్లయితొలగించండివాకిలడ్డరు లక్ష్మణు వాసము జన
విన్నవించ ననుజ నాజ్ఞ వేగ రాగ
వినయము జనియె నానతి విన్నవించి
2. లక్ష్మణుడు జన ద్వారపాలకుడు వెడలె
భరతునకు రాము నానతి భక్తి దెలుప
రామునిచ్ఛను వేగము భరతు రాక
విశద బరచి దాను జనగ విన్న వించె
3. బలుడు భరతుడు నది బహు బాగు యనుచు
దిగెను సింహాసనము మాట ముగియ గుండ
కాలు దింపియే ద్రిగ్గున కాలి నడక
రయము జనియె నన్నను గన రమ్య మనుచు
4. వెడలెడు భరతుని గని దౌవారి కుండు
వేగమే జనే శత్రుఘ్ను వేడ్క జూడ
రఘకుల తిలక జను వీవు రాము గనగ
మురిసి లక్ష్మణ భరతులు మున్ను జనిరి..
ఓం శ్రీరామ! శ్రీ గురుభ్యో నమః!🙏
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగురువుగారికి నమస్సులు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిNamaste
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅయ్యగస్త్యుడన్ కుంభజు డట్లు నుడివి
రిప్లయితొలగించండిరామునకు నీ కథనె వేరు రమ్య మైన
వాక్య మిట్లు చెప్పదొడగె పరిఢవిల్ల
దండు డేలెను రాజ్యంబు తదుపరి యని.
దండుడు మనోనిగ్రహమున తలరుచుండి
యాయుతములవత్సరముల నరి విహితపు
రాజ్యమును పరిపాలించె రామ వినుము
మసలుచుండ నట్లొక చైత్ర మాసమందు.
చాల రమణీయమైన యా చైత్రమందు
నాత డరిగె శుక్రాచార్యు నాశ్రమమున
కొక్క నా డట్లు జని కాంచె జుక్క సుతను
భువిని సరిలేని సౌందర్యమున వెలుంగ.
కాంచి యామెను దుర్బుద్ధి కలుగ నంత
మన్మథ శరపీడితు డయి మనసుపడుచు
భయపడు పడతిన్ డగ్గఱి పలికె నిట్లు
విను శుభానన సుశ్రోణి యనుచు పిలిచి.
మంగళప్రదురాల! నే మరుని చేత
పీడితుడనై యడుగువాడ ప్రియము తోడ
నెచట నుండి వచ్చితివొ? నీ వెవెరి సుతవొ?
యనుచు మోహపరవశుడౌ నతని కాంచి.
పడతి బ్రతిమాలుచు నిటుల బదులు నిడియె
ఓ మహారాజ! అరజ గా నొప్ప నామ
మేను పుణ్యకర్మముల జేయు ఋషివరుండు
దీప్తుడౌ శుక్రుని సుతను తెలిసికొనుము.
ముట్టకు నను బలాత్కారములను జేసి
తండ్రి వశమున వర్తిలు దాన నేను
ఛాత్రుడవు నాదు తండ్రి యాచార్యు డగుచు
తబిసి కోపించుచో నాపద యగు నీకు.
ఎట్టి దైన ప్రయోజన మీకగునెడ
నా వలన, ధర్మ మార్గమున జని మున్ను
గొప్ప తేజస్వి నా పితన్ కోరుకొనవె
యట్లు కానిచో నత్యంత హాని కలుగు.
క్రోధితుండైన నాతండ్రి రోదసి నగు
దగ్ధ మొనరింపగా సమర్థత గలాడు
సుందరాకార! యాచింప శుభము పితను
నావు డా కాముకుడు మదోన్మత్తు డగుచు.
శిరసు పై నంజలి ఘటించి చెప్పె నిటుల
అరజ! సుశ్రోణి! ఇందునిభానన! విను
కాలము గడిపి వేయకు కనగ నింత
ప్రాణముల్ కడతేరుచు పాఱుచుండె.
నిన్నుపొందిన పిమ్మట మన్నుబడెడు
ఘోర పాప మంటెడు గాక కొతుక నిచట
వ్యాకులత చెంది సేవించు భక్తు కాంచు
మనుచు బలవంతు డగు దండు డామె బట్టె.
బాహువులతోడ బిగియించి పట్టుకొనియు
పెనగులాడెడు నరజను విడువకుండ
మైథునము సలిపి యథేచ్ఛ మసలి యతడు
మొఱకడము జేసి మధుమంత మునకు నరిగె.
అరజ మిక్కిలి భీతిలి యాశ్రమమున
కాల్వలై పాఱ యేడ్వగ కంటినీరు
తపసి దేవతాతుల్యుడౌ తండ్రి కొఱకు
నొకట నామె నిరీక్షించుచుండె వ్యధను.
ఉత్తరకాండ 80 వ సర్గ సమాప్తము.
'పడతి బ్రతిమాలుచు...' పద్యం మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
తొలగించండి(సవరణతో....)
రిప్లయితొలగించండిశ్రీమద్రామాయణము - ఉత్తరకాండము - 84వ సర్గ
(లక్ష్మణుడు అశ్వమేధయాగమును గూర్చి చెప్పుచు ఇంద్ర వృత్రుల కథను చెప్పుట, వృత్రుడు తపస్సు చేయుట, అతనిని చంపుమని ఇంద్రుడు విష్ణువును ప్రార్థించుట)
రాముఁడును మహాత్ముఁడగు భరతుఁడు నటులఁ
బల్కినట్టి మాటలు విన్నవాఁడునైన
లక్ష్మణుండు రాఘవునితో లలిత శుభద
మైన వాక్యమ్ముల నిటుల ననియె నపుడు. (1)
అశ్వమేధ మ్మనఁగ మహాయజ్ఞ మగును
పాపసంఘమ్మునుండి పావన మొనర్చు
నెదురు లేని పవిత్రత నిచ్చుఁ గాన
నద్ది నీ కిప్పు డిష్టమై యలరుఁ గాక. (2)
వినమె పూర్వము ఘనుఁడు నింద్రుని విషయము
బ్రహ్మహత్యాఘ మంటినవాఁడు దా నొ
నర్చి యశ్వమేధమ్మును నష్టపాపుఁ
డై పవిత్రత నందినాఁ డది విదితమె. (3)
దేవ దానవుల్ సౌహార్ద భావమున మె
లంగినట్టి యా పూర్వ కాలమ్మునందు
వృత్రుఁ డను దైత్యుఁ డొక్కఁడు పేరు వడసె
లోకసమ్మతుఁ డనుచు లోకైకవీర! (4)
యోజనశత విస్తీర్ణము యోజన త్రి
శతము నగు నెత్తు గల్గు నా దితికులజుఁడు
మూడు లోకములను స్నేహమునఁ గను నను
రాగ ముప్పొంగ నెప్పుడు రామచంద్ర!
ధర్మవిదుఁడై కృతజ్ఞుఁడై తగిన బుద్ధి
కుశలత గలిగి సువిశాల కువలయమును
ధర్మమును దప్పకను సావధాన చిత్తుఁ
డగుచుఁ బాలించినాఁడు వృత్రాసురుండు. (6)
అతఁడు భూమిని పాలించునట్టి తరుణ
మవని సర్వకామదగఁ దా నలరె సర్వ
పుష్పములు, ఫలములు, మూలములు గన రస
వంతములుగ వర్ధిల్లెను వాటముగను. (7)
దున్నకయె భూమి సస్యసంపన్న యగుచు
వెలసె సమృద్ధితో నట్టి విస్తృతముగ
నద్భుతముగఁ గన్పట్టు రాజ్యమును బొంది
యనుభవించుచు నుండె వృత్రాసురుండు. (8)
పెక్కు శ్రేయమ్ముల నొసంగి పేర్మి నితర
సుఖముల ననంతముగ నిచ్చు శుభదమైన
నుత్తమంబైన తపముఁ జేయుదును గాక
యనెడి కోరికయే కల్గె నతని మదిని. (9)
మధురుఁ డను పెద్ద సుతుని సామ్రాజ్యపాల
నమున నిల్పియు సుర సమస్తముఁ దపింప
జేయు నుగ్రతపమ్ము నజేయముగను
జేయసాగెను వృత్రుఁడు సేరి వనము. (10)
ఘన తప మ్మొనరించు వృత్రునిఁ గనుఁగొని
కడు భయార్తుఁడై యింద్రుఁడు వెడలి విష్ణు
మూర్తి సముఖమ్మునకుఁ జేరి పూజఁ జేసి
వినయ వినమితుఁడై యిట్టు లనియె నపుడు. (11)
దుస్సహము ఘోరమైన తపస్సు వలన
సర్వలోకాధిపత్యము సాధ్యమయ్యె
వృత్రునకు; ధార్మికుఁడు బలభీముఁ డగుట
నతని శాసింప శక్తి లేదయ్య నాకు. (12)
ఇతని తప మిట్లు కొనసాగె నేని దేవ!
యెంతకాలమీ లోకమ్ము లెలమి నుండు
నంతవర కితనికి వశమగు నటంచు
నాకుఁ దోచెను సురగణనాథ! వినుమ. (13)
ఘోర బలశాలియుఁ బరమోదారుఁడైన
వీని నిటుల నుపేక్షింపఁ బూని తేల?
నీవె కోపింప వృత్రుఁడు నిముసమేని
నుండఁగలఁడె? నిక్క మిదియ, యో సురేశ! (14)
ఎపుడు నీ స్నేహభావన మితనిపైన
కలిగె నప్పటి నుండి లోకముల కెల్ల
నితఁడు ప్రభువుగా నున్నాఁడు హే ముకుంద!
శేషశయన! విష్ణు! ముకుంద! చిద్విలాస! (15)
అట్టి నీవు లోకమ్ముల సావధాన
చిత్తత ననుగ్రహింపు, జగత్తు నీదు
రక్షణమ్మున బాధావిరహితమును బ్ర
శాంతతను బొంది యుండును శాశ్వతముగ. (16)
ఈ సమస్త దివౌకసు లెదురుచూచు
చున్నవారలు నీకయి యో ముకుంద!
వృత్రసంహారమును జేసి వేల్పులకు స
హాయ మందించుమో దేవ! యబ్జనాభ! (17)
ఎల్లకాలము నీచేత హితమునంది
రిమ్మహాత్ములు దేవత లితరు లెవ్వ
రిట్టి సాయముఁ బొందలే రిది నిజమ్ము
గతి దొరంగినవారికి గతికి నీవు. (18)
శ్రీమద్రామాయణము, ఉత్తరకాండము, 84వ సర్గ సంపూర్ణము.
8వ పద్యం రెండవ పాదంలో 'వెలసె సంపుష్టితో...' అని సవరణ.
తొలగించండి5. మేలు గద్దెను శత్రుఘ్ను మీరి దుమికి
రిప్లయితొలగించండినమ్ము రాము వాసమునకు నమిత భక్తి
వడి నడుగుల నతనికి వందనము జేయ
కారణమరయగ ననుజు కట్టడేలొ..
6. వార్తరూకుడు కైమోడ్చి వందన మిడి
వినయమున నిల్చి నెల్లర జెప్పి తినన
అవనత వదనుడై రాము డాలకించి
ననుజులను వేగ దెమ్మని నయము బలికె
Thank you for adding me
రిప్లయితొలగించండిthank you for adding me
రిప్లయితొలగించండినూట నాలుగవ సర్గము
రిప్లయితొలగించండి***
కాలపురుషుడు శ్రీరామునకు బ్రహ్మదేవుని సందేశమును చెప్పుట, రాము డంగీకరించుట.
***
విను మహాసత్త్వ! నారాక పనిని, పంపె
నను పితామహదేవు డో ఘన తరస్వి!
పరపురంజయ! మున్ను నీ వరసుతుండ
కాలమును సర్వసంహారకర్త నేను. 1
లోకపతియును ప్రభువు నిర్గుణుడు తాత
పలుకుచున్నాడు సౌమ్య! కాపాడ జగతి
నొప్పుదల జేసి యుండినా వొకటి నీవు
మాయచే లోకముల మున్ను మడియ జేసి. 2
జలధిశాయివై మును నన్ను సంతరించి
వెనుక నుదకేశఫణి ననంతుని సృజించి
చేసితివి మధుకైటభ చేతనముల
వారి యస్థి చయమ్ముల వసుధ నిండె. 3
నీదు నాభిని దివ్యార్క తాదృశంపు
పద్మమున జేసి నను ప్రజాపతుల పనుల
బెట్ట నిను నుపాసించితి విశ్వభర్త!
కావు నాదు తేజస్కరా జీవుల నని. 4
రక్ష సేయగ నంతను ప్రాణి తతుల
ప్రతిఘటింప నశక్తమై వరలునట్టి
నీ సనాతన పద్మభవాసిక విడి
విష్ణుతత్వము నొందిన విభుడ వీవు. 5
అదితి గర్భాన వీరుడై యవతరించి
వలయు వేళల సోదరవరుల కొరకు
విక్రమము వృద్ధి జేసెడి ప్రక్రియలను
కూడగడుదువు వారికి తోడుపడగ. 6
స్వయముగా పదునొక్క వే వత్సరములు
ధాత్రిపై నుండు నియమము దాల్చు నీకు
దశరధాత్మజునిగ బుట్టి ధరణి పైన
నరులలోన పూర్ణాయువు నెరవె నయ్య. 7
కాన నరవర శ్రేష్ఠ! మా కడకు నీవు
తిరిగి వచ్చెడు కాల మేతెంచె నింక
నో మహారాజ! యింకను భూమి జనుల
గావ నెంచిన యిచటనే గలుగు వీర! 8
రామ యట్లు కాదేని స్వర్ధామమునను
పాలనము జేయ నభిలాష బడయు దేని
సురలు నిర్భీతు లింక శ్రీహరిని గూడి
భద్ర మగు గాక నీకని బ్రహ్మ పలికె . 9
కాలపురుషుని ముఖమున కర్త కబురు
వినిన నవ్వుచు రాఘవు డనియె నిట్లు
దేవదేవుని చిత్రోపదేశమునను,
నీదు రాకను మిక్కిలి మోద మాయె. 10
ముజ్జగముల కార్యార్థమే మజ్జననము
నీకు మంగళ మగుగాక నిశ్చయముగ
నెచటి నుండి యిచ్చోట కేతెంచినాడ
నచటికే కాలపురుష! నే నరుగ గలను. 11
సర్వసంహార! నిను గూర్చి స్మరణ జేయు
వేళనే వచ్చినాడ వీ విషయ మందు
నన్య చింతన లే దజు డాడి నట్లు
సురల కన్నిట వశవర్తి నరయ గాదె? 12
***
శ్రీ మద్రామాయణము నందు ఉత్తరకాండములో నూట నాలుగవ సర్గము సమాప్తము.
శ్రీ గురుభ్యో నమః!🙏
రిప్లయితొలగించండిఓం శ్రీరామ జయరామ జయజయరామ .
రిప్లయితొలగించండిశ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష
7. నాదు ప్రాణము వారును నాకు బ్రియము
రిప్లయితొలగించండిసరగు దెమ్మ మీవెనువెంట సంతసంబు
నానతి వినఁగ వ్రాలిరి నాదు చెంత
కన్నులును వేచెను దమ్ముల గనగ వేగ
8. కరము జోడించి వెలుగగ గన్ను సైగ
సావధానము ననుజుకు సాదరంబు
ప్రియమున ననుజ్ఞ బొందిరి పీఠ మెక్క
గనగ రాముని చకితులై గళయు లేక
శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణైనమః
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఓం
రిప్లయితొలగించండిశ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమద్రామాయణము : ఉత్తరకాండము
త్రయోదశ సర్గ
[రావణుఁడు నిర్మింపఁజేసిన శయనగృహమునఁ గుంభకర్ణుఁడు శయనించుట, రావణుని దురాగతములు, కుబేరుఁడు దూతనుఁ బంపి, రావణున కుపదేశమొనరించుట, రావణుం డా దూతను చంపించుట]
అనె నగస్త్యుఁడు రామున కపుడు "రామ!
పిదప నొక కొంత కాలాన వేధ ప్రేరి
తమగు తీవ్ర నిద్రయ యప్డు తన మహిమను,
జృంభ రూపాదులనుఁ గొని, చేరి, కుంభ
కర్ణు నావహించెను తమకమున మిగుల! 13.1
అంతఁ గుంభకర్ణుఁడు చని, యాసనమునఁ
గూరుచొనియున్న నగ్రజుఁ గూర్చి "రాజ!
నన్నుఁ బెను నిద్ర బాధించుచున్నదయ్య!
శయన గృహమును గట్టించుమయ!" యనియెను; 13.2
అనినయంతనె రావణుం డాజ్ఞ నిడఁగ,
విశ్వకర్మనుఁ బోలు శిల్పిగమి, యొక్క
యోజనమునకును ద్విగుణ యోజనముల
పొడవు వెడలుపు లున్నట్టి, పొలుపు మీఱు
ఘన గృహముఁ గట్టి, యిడెఁ గుంభకర్ణునకును! 13.3
స్ఫటిక కాంచన చిత్రిత స్తంభ ఘటిత
భాసితమ్ము, వైడూర్య సోపాన కృతము,
శింజినీ జాలకము, దాంత శిల్ప తోర
ణాన్వితమ్ము, వజ్రస్ఫటికాంచితంపు
టరుఁగు లలరె సుఖద మనోహర గృహమున! 13.4
మేరుపుణ్యగుహక్రియన్ మెఱయునట్టి
సకల సుఖకరమైన వేశ్మమ్మున నతి
బలుఁడు కుంభకర్ణుఁడు చేరి, బహు సహస్ర
వత్సరములు శయించి, తెర్వఁడయె కనులు! 13.5
కుంభకర్ణుఁ డా విధి నిద్రఁ గూఱియుండ,
నిచటఁ బౌలస్త్యుఁ డాపఁగ నెవరు లేక,
దేవమునియక్షగంధర్వదృఘువులపయిఁ
బడియుఁ బీడించె, దయలేనివాఁడునయ్యు! 13.6
అమిత కోపాన్వితుఁడయి దశాననుండు
నందనాదివిచిత్రవనమ్ములకును
జనియు, నన్నింటిఁ గూల్చెను జాలిలేక!
కోపమున్నట్టివారల నాపఁదరమె? 13.7
నదుల యందునఁ గ్రీడించు నాగము వలె,
వర కుజమ్ములఁ బెకలించు వాయువు వలెఁ,
బర్వతముల ఱెక్కలఁ ద్రుంచు వజ్రము వలె,
దనుజుఁ డా రావణుఁడు వన ధ్వంసకుఁ డయె! 13.8
పంక్తికంఠుఁ డిట్లొనరుచు వార్త లెఱిఁగి,
యనుఁగుఁ దమ్మునిం గాంచు వంకనుఁ గొనియును,
ధనదుఁడౌ కుబేరుఁడు వంశ ధర్మనిరతి
దృష్టి నిడికొనియు, హితోపదేశమిడఁగ,
నతని లంకకు నొక దూత నంపె నపుడు! 13.9
ఆతఁ డట్టు లా లంకకు నరిగి, చన వి
భీషణుని గృహమ్మునకునుం, బ్రేమఁ జూపి,
యతని కాతిథ్య మిడి, వాని యాగతి వినఁ
బృచ్ఛసేసె విభీషణుం డిచ్చతోడ! 13.10
ధనదు క్షేమమ్ము నడిగి, యాతని స్వజనుల
నరసియు విభీషణుం డంత, నచట సభను
నగ్ర సింహాసనాసీనుఁ డగ్రజుఁడగు
రావణుం జూపె దూతకుఁ బ్రమదమునను! 13.11
అచట స్వీయ తేజమ్ముతో నడరుచున్న
ప్రభుని రావణుం గని, జయధ్వానములనుఁ
దగు విధమ్మునఁ గీర్తించి, ధనదు దూత,
యుక్తి యుక్తుఁడు క్షణకాల మూరకుండె! 13.12
అటు పయిని రాయబారి, వరాస్తరణ వి
శోభితోత్తమపర్యంకసుఖవిలాసుఁ
డైన రావణు, దశకంఠు, నసుర నృపునిఁ
గూర్చి యిట్టుల వచియించెఁ గూర్మిమీఱ! 13.13
క్షితిప! మీ సోదరుఁడు వచించిన విషయము
నంతయును వచించెదనయ్య హర్ష మెసఁగ!
వీర! యిదియ మీ యుభయ సద్వృత్త వంశ
ములకు ననురూపమైనది పూర్ణముగను! 13.14
"సోదరా! యింతవరకీవు చూపినట్టి
ఘన కృతము లింకఁ జాలును! కంటిఁ దృప్తి!
నీకు సాధ్యమ్మె యైనచో, నీదు బుద్ధి,
ధర్మమార్గమ్మునకుఁ ద్రిప్పఁ దగును వత్స! 13.15
భగ్ననందనవనదృశ్యపంక్తిఁగంటి!
నీవు ఋషులఁ జంపించిన కృతము వింటి!
రాజ! నినుఁ గూల్పనున్న గీర్వాణ యత్న
మంతయును వింటి వత్స, నే నింతదాఁక! 13.16
స్వస్తి
[సశేషము]
అనంత ఛందము నందు పాల్గోన్న గురుదేవులకు మరియు కవివరులకు పాదాభివందనములు.
రిప్లయితొలగించండిజై శ్రీరామ్.
దుర్వాసుడు నాపై కోపగించినాడు కావున పద్యనడక చూచి తమరి అభిప్రాయములను తెలుప ప్రార్ధన
అథ పఞ్ఛాదిక శతతము సర్గ
ఉత్తరకాండము..
========****====
1. రాచ కార్యమని దెలిపి రామ విభుడు
కాల పురుషుని తోడను కలసియుండ
రామ దర్శనమును కోరి రయము గాను
వచ్చె పూజ్య దుర్వాసుడు వడువు వలెను
2.రాజ ద్వారమందున గాంచి లక్ష్మణుండు
పలుకరించె మునివరుని ప్రణతులిడుచు
తమరి దర్శనమున కడు తనివి నొంది
చెప్ప వలయు సేవకునకు శీఘ్రము గన
3. లక్ష్మణుని బలుకులు విని లక్షితుండు
రామ దర్శనమ్ము నడిగె రయము గాను
ఇంచు కైన నాకార్యము మించిపోవు
చెప్పు రామ విభునకు నీ శ్రీఘ్రముగన
4. శత్రు సంహారకుండు సౌమిత్రి యంత
ప్రణతు లిడుచు నోమునివర్య పనిని దెల్ప
ఓ ముహూర్త కాలమునందు నొనరు జేతు
రాచ కార్యమని దెలిపె రామ విభుడు
5. అంత దుర్వాసు డతనిపై నాగ్రహమున
చూపుతో కాల్చు నట్లుగా జూచి బల్కె
రామునకు నీక్షణమున నారాక దెల్పు
డట్లు గాక యున్నను మరి యాగ్ర హింతు
6. లక్ష్మణా! దేశమునకు నీ రామ, భరత
సంతు మిత్ర తతికి వేగ శాపమిడుదు
నాప జాలను మదిలోని కోపమునను
నాదు తత్వ మెరిగి నడచు కొనుడు
7. కలతపడి లక్ష్మణుండంత కైపదమున
జిక్కితి ముని వరునకని చింతనమున
ఈ మహాప్రభావంతున కేమి జెప్ప
వలయు నేనేమి జేయంగ వలయు ననుచు
8. ఇచ్చినను శాపమును నాకు నిచ్చు గాక
వచ్చినను మరణము నాకు వచ్చు గాక
యనుచు మరి నిశ్చయించిన యట్టి యతడు
రామ మందిరమున కేగె రయము గాను
9. రామునకు ప్రణతు లనుచు లక్ష్మణుండు
తమరి దర్శనమ్మును కోరి తరలి వచ్చె
తాపసి యగు దుర్వాసుడు, త్రాతవైన
రామ! వచ్చి రక్షింపుడు ప్రజల నెల్ల
10. లక్ష్మణుని బలుకులు విని రామ విభుడు
కాల పురుషుడను మరల కలువ మనుచు
పంపె త్వరిత గతిని, రామ బయలు నున్న
ముని వరునకు వందన మిడె పొంకమలర .
సాయిరామ్ నా కుమారుని పేరు వచ్చు చున్నది.
రిప్లయితొలగించండివరప్రసాద్. .
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుబ్యోనమః
రిప్లయితొలగించండిశ్రీ బాలాత్రిపుర సుందర్యై నమః
92వ సర్గ. 1-3 శ్లోకాలు
రిప్లయితొలగించండివలసినంత సామగ్రిని పంపి దాశ
రథి సులక్షణశోభితరమ్యకృష్ణ
వర్ణ హయమును విడచెను; లక్ష్మణునిహ
యమువెనుక ఉండి ఋత్విక్కులనుసరింప
సంచరించమనికదలె సైన్యముగొని
నైమిషము వైపుగనపుడు రామవిభుడు
ఆమహాబాహువచ్చట అద్భుతమగు
యజ్ఞ వాటమునుగని ఆహ్లాదమొందె
92వ సర్గ. 1-3 శ్లోకాలు
వలసినంత సామగ్రిని పంపి దాశ
రథి సులక్షణశోభితరమ్యకృష్ణ
వర్ణ హయమును విడచెను; లక్ష్మణునిహ
యమువెనుక ఉండి ఋత్విక్కులనుసరింప
సంచరించమనికదలె సైన్యముగొని
నైమిషము వైపుగనపుడు రామవిభుడు
ఆమహాబాహువచ్చట అద్భుతమగు
యజ్ఞ వాటమునుగని ఆహ్లాదమొందె
రిప్లయితొలగించండిశ్రీ గురుభ్యోనమః
అథ ద్విచత్వారింశః సర్గః ( 1-7 శ్లోకములు )
దీర్ఘబాహుడా రాముడు తేజమొప్పు
పసిడి పుష్పకమ్మును త్రిప్పి పంపె ముదముఁ
నరిగె యా యశోక వనికి యంతనతడు
చందనాగరు మరి రక్త చందనంబు
దేవదారు పున్నాగంబు మావి చెట్ల
చేత యా యశోకవని భాసిల్లుచుండె
చంపకాశోక పనస యసన మధూక
వృక్షములు పొగలేనగ్ని బెట్టు కాంతిఁ
పారిజాత వృక్షంబులు ప్రబలనిచ్చె
ఆ యశోక వనంబున యరటి మద్ది
నాగ యేడాకులరటి మన్ధార చెట్లు
బండి గులివింద పొదలతోన్ వ్యాకులంబు
ఆ యశోక వనంబు ప్రియంగు వకుల
జంబు కోవిదారముల తేజమలరంగ
ఆ వనమ్మునన్ని తరువుల్ నను దినంబు
పుష్పముల్ ఫలముల్ నిండె మురిపెముగను
గొప్ప రసగంధములనంత గూర్చుచుండె
క్రొత్త యంకురంబుల్ లే చిగుళ్ళు వేసె
కనుల కింపుగాను వనరక్షకులు రక్ష
జేయ తుమ్మెదలలరారె చూచి మురియ