4, జులై 2018, బుధవారం

ఉత్తరకాండము - అనువాదం - సూచనలు.

ఉత్తరకాండము - అనువాదకులకూ పరిష్కర్తలకూ సూచనలు.

దయచేసి కవిమిత్రులు అందరూ ఈ కాండలోని ఏ సర్గకు సంబంధించిన శ్లోకాలను తెనిగించి ఆ సర్గ తాలూకు టపా క్రిందనే వ్యాఖ్యల రూపంలో ఉంచండి. ఎక్కడపడితే అక్కడ పద్యాలను ఇస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది సేకర్తలకు.


మీమీ తెలుగు పద్యాలకు మూలాన్ని తప్పని సరిగా సూచించండి.

ఉదాహరణకు

(ఉత్తరకాండము - 1వ సర్గ 10వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు)

పద్యం
పద్యం
...
పద్యం.

మొత్తం 16 పద్యాలు

ఈ విధంగా సూచించటం వలన పరిష్కర్తలకు ఒకే సర్గలో

వివిధ శ్లోకాలకు వేరు వేరు కవుల పద్యాలను ఒక క్రమంలో ఉంచటానికి వీలవుతుంది.
అలాగే మొత్తం సర్గ అంతా ఒకే కవి వ్రాసినా భాగాలు భాగాలుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యల రూపంలో పద్యాలను ఇచ్చినా అన్నింటినీ ఒకక్రమంలో ఉంచటానికి వీలవుతుంది.

పద్యాలన్నీ వాల్మీకాన్ని తప్పనిసరిగా అనుసరించాలన్న నియమం ఉందని ప్రసాద్ గారి వలన విన్నాను. వీలయినంతవరకు

వాల్మీకి ఇచ్చిన పదాలను వాడండి,

భావంలో స్వతంత్ర కల్పనల కన్నా వాల్మీకిని అనుసరించటానికే పెద్ద పీట వేయండి.

ఆన్నీ తేటగీతికలే.

ఐతే ఇల్లాంటి తెలుగుపద్యాలకు పాదాంత విరామం వీలైనంతగా ఇవ్వటం శోభిస్తుంది.

సర్గలను పంచటమూ లేదా పెద్దసర్గలో భాగాలను పంచటమూ తోపెల్లవారి బాధ్యత అనుకుంటాను.

తోపెల్ల వారికి విజ్ఞప్తి ఏమిటంటే మూలాన్ని దిగుమతి చేసుకుందుకు ఈ భాగులోనే లింకులు ఇవ్వండి.  మొబైలో watsapp వంటివాటి ద్వారా  ఇస్తే నాబోటి వారికి ఇబ్బంది. నాకు మొబైల్ నిరంతరాయంగా వాడటం సాధ్యపడదు.

పరిష్కర్తలకు సూచన.  పద్యరచయిత వ్యాఖ్య క్రిందనే తమ పరిష్కరణలు సూచించటం మంచిది. మరలా మొత్తం పద్యాలన్నింటినీ ఉటంకించవద్దు.  పద్యారంభాన్ని సూచించి దానిలో మార్పులు సూచిస్తే చాలును. దయచేసి పద్యరచయితలు ఒక్క విషయం గమనించాలి - పరిష్కర్తలు సవరించిన పిదప వారితో వాదాలకు దిగకండి. వారి నిర్ణయం ఖరారుగా తీసుకోవలసినదే. చర్చలు అనుమతించబడవు - వాటితో గడబిడ వలన టపాలు కూర్చటం పెద్ద శ్రమ అవుతుందని గమనించగలరు.


అన్ని సర్గలకూ వేరు వేరు టపాలు ఏర్పాటు చేస్తున్నాను. ఆయా సర్గలక్రిందనే తమ అనువాదాలు, పరిష్కరణలూ అన్నీను.


అందరూ సహకరించవలసిందిగా ప్రార్థన.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్‌ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.