9, జులై 2018, సోమవారం

ఉత్తరకాండము - 62వ సర్గ

 
ఓం ..శ్రీ గణపతయే నమః ..శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః .../\
శ్రీమద్రామాయణము ...ఉత్తర కాండము ...62 ..సర్గ ..1--21 శ్లోకములు ..

తేటగీతులు ...

రాముడు ఋషుల మ్రొక్కుచు రమ్యరీతి
వారి మాటలు వినుచును పృచ్చ నడిగె
నిట్లు , లవణాసురుమిగుల నెట్టి భుక్తి
తినును ?ఎవ్విధ నడవడి ? తెలుపు సుమ్మి ! (1)

రామునిదెమాట వినినట్టి మునులు దెల్పె
లవణుడెటులవృద్దొందగ రక్తి గట్టె ?
మధువననివాసి ,మునులదే మాంస మెంతొ
మత్త యౌప్రాణు లన్నియు మెక్కు చుండ !(2) (3)

కొన్ని వేలసింహపులేళ్ళ ,గోరి నరుల
పగలు జంపుచు నిత్యమె బట్టి దినును
ప్రళయ కాలము నందున బలము యున్న
మృత్యు దేవతాననదెర్చి మృగము దిన్న! (4) (5)

రాముడువినగ మునులతో ప్రతిగ బల్కె
ఆతని దునుమాడగ జేదుఁనత్యవసర
ముగను,భయమును విడువుడు ముందు మీరు
వినిన మునులంత ముదముగ వినతి జేసె !(6)

రాముడు గ్రతేజులె మునులకునుఁజేసె
యాన ,చటనున్న సోదరు నంత జూసి
ఇట్లడిగెరామ ,లవణుని నెవ్వ ? ధీర
జంప గలడునో బహుబల శాలి భరతు? ! (7) (8)

వానినికడదేర్చ బహు ,బహు బుధుడంత
శత్రు ఘ్నువశ మగునీయ సాధ్య మగునె
అన్న వచనము వినినంత భరతు ప్రతిగ
బల్కె ,దునుమాడెదనేను బట్టి భాగ
మీయ నాకును వచియించె మీదు ప్రేమ ! (9)

పసిడి యాసన మందుండి పలుక గాను
మ్రొక్కుచునురాజు నుత్తముడులె
భరతుడునుగొప్ప కార్యము బట్టి యుండె
ఇంతకు మునుపే ,యొప్పుచునెంత మేలు ! (10)

తొలుత నార్యుల రాకకై దుఃఖ మొందె
అయోధ్య నందు సంతాప మందుండె
మనము పరితపించ గనెంతొ మదన పడగ
రక్ష ణీయగ దేశము లాటుఁనఱయ !(11)

రాజ!కఠినమౌ దుఃఖముల లాటు బడసె
గొప్ప యశమున్న ప్పటికి గోరి ఫలము
నంది గ్రామముఁ దినుచును కంద మూల
ములనె భుక్తిగా ,జటనొంది చనుచు గడిపె !(12)

నార బట్టలె ధరియించె నంది నందు
కటిక నేలపై శయనించె గరిమఁదండ్రి
బాధ నెంతయొ దిగమ్రింగి ప్రజల మేలుఁ
గోరి పరిపాలనొనర్చెఁగునుకు ద్రప్పి ! (13)

ఇట్టి క్లేశములబడసె నితడు నోర్మి
నేను జనుటకు సిద్ధమే ఋషుల జెంత
భరతు నిమరిక్లే శములను బడయ నీయ
పంప దగిననే నుండగా బాడి గాదు ! (14 )

తమ్ము నివెమాట లువినగ తనర రామ
నట్లె ,యగుగాక నదిశాస నముగ నాదు
మంగళ కరమైనగరము మధువు నందు
రాజు గనునిన్ను జేయుదు లక్షణముగ !(15) (16)


భరతునికిశ్రమ నీయక భార మవక
దలచె శూరుడు వీవును ధర్మములను
విద్య నెఱింగి రాజ్యము వివృత జేయ
నేర్పరివినీవు దేశము నేలు కొనుము !(17)

యమున తీర మందున గట్టు నందమైన
నగర మొకటియు భద్రమై నట్టిదేను
జనపదమునింపు ,వంశము సమసి బోవ
నిమ్న రాజ్యముఁ మరొకరి నియమితి లేక! (18)

రాజ్యమునివేశనమునందు రాజు నుంచ
యున్నచొనట్టె వరైనను యమపురి కియె
ఏగునన్నది సత్యముఁనెంత జూడ
అనుచు నానతి నీయగ ఆర్ద్ర తగను ! (19)

శూర !నామాట వలదన్న యుక్తమేన ?
అన్న ననుజ్ఞ పాటింపు చిన్న వారు
ఇందు నమరేమి సంశయ మేమి లేదు
అనగ రాముడు ,తమ్ముడు నట్లె యనెను ! (20)

నేను కడగట్టి నభిషేకఁనిక్కచ్చిగ
అమలు జేయగ వశిష్టు , లందరున్ను
యథా శాస్త్ర్రము సలుపగ యంత జూసె
స్వీకరించుము ద్విజుల స్వస్తి గరిమ !

బాల నందిని అను ఉత్తర కాండము లో 62. సర్గ సమాప్తము .
1..నుండి 21 శ్లోకములు .../\ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్‌ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.